ఆయన అక్షర యాత్ర చేశారు..

ఆయన అక్షర యాత్ర చేశారు..

కవి, తెలంగాణ రాష్ట్ర గీతాన్ని రచించిన శ్రీ అందెశ్రీ గారు హఠాన్మరణం దిగ్భ్రాంతి కలిగించింది. అందెశ్రీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలియచేశారు. ఆయన రచనా ప్రస్థానం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకొంటుందని.. గొర్రెల కాపరిగా, భవన నిర్మాణ కూలీగా జీవితం మొదలుపెట్టి అక్షర యాత్ర చేశారు అన్నారు. తెలంగాణ జానపదాల పై, మాండలికం పై పట్టు కలిగిన రచయిత ఆయన. పలు సినీ గీతాలు రచించారు.

‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు…’ గీతం వింటే సమాజాన్ని అందెశ్రీ ఎంతగా చదివారో అర్థమవుతుంది. ‘జయ జయహే తెలంగాణ జననీ జయ కేతనం’ అంటూ తెలంగాణ రాష్ట్ర గీతాన్ని అందించారు. అందెశ్రీ గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను అని పవన్ కళ్యాణ్‌ తెలియచేశారు.