పోటెత్తిన భక్తజనం.. క్యూలైన్లలో బారులు..

పోటెత్తిన భక్తజనం.. క్యూలైన్లలో బారులు..
పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : పెద్దపల్లి మండలం దేవునిపల్లి శ్రీ లక్ష్మీనృసింహస్వామి(Sri Lakshminrisimhaswamy) కళ్యాణం వేదపండితులు ఆలయ ప్రాంగణంలో సాంప్రదాయబద్ధంగా కళ్యాణ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి స్వామివారి కళ్యాణం తిలకించేందుకు భక్తులు పోటెత్తారు. స్వామివారి కల్యాణాన్ని జనం కన్నులారా వీక్షించి తనివితీరారు.
అనంతరం ఆలయంలో శ్రీ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. ఈ ఏడు కనీవినీ ఎరుగని రీతిలో పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో జాతర ప్రాంగణం(Jatara Praganam) కిక్కిరిసింది. పెద్దపల్లి డీసీపీ కరుణాకర్(DCP Karunakar), సీఐలు ప్రవీణ్ కుమార్, అనిల్ కుమార్, ఎస్సైలు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పెద్దపల్లి రూరల్ ఎస్సై మల్లేష్ ఆద్వర్యంలో పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు.
