భారీ నష్టాల్లో రైతన్న ..
భారీ నష్టాల్లో రైతన్న ..
వెల్దండ, ( ఆంధ్రప్రభ )
మహబూబ్ నగర్ జిల్లా సమీపంలో కురిసిన భారీ వర్షాల కారణంగా పలు గ్రామాలలో రైతులకు భారీ నష్టం వాటిల్లినట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వెల్దండ మండల సమీపంలోని రాచూర్ గ్రామానికి చెందిన దుబ్బ వెంకటయ్య 3 ఎకరాలు, దుబ్బ బాలయ్యకు సంబంధిన 4 ఎకరాల వరి పంట పూర్తిగా జలమయం కావడంతో రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. భారీగా కుర్షిన వర్షాల కారణంగా చెరువులు కుంటలు అగెలు గెల్లి పారడంతో లోతట్టు పొలాలు పూర్తిగా జలమయమైనట్టు తెలిపారు. ఆరుగాళ్ల కష్టం చేసి పండించిన పైరు పంట పదిరోజులు గడిస్తే కోత కోసే సమయంలో ముంచెత్తిన వరద వలన వరి పంట పూర్తిగా నీటిమయం కావడంతో భారీ నష్టం వాటిల్లిందంటు రైతులు తెలియజేశారు. నీట మునిగిన వరి పంటను చూస్తూ కన్నీరు మున్నీరై రోదిస్తూ ప్రభుత్వ పరంగా పంట నష్టపోయిన రైతులని ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.
