ఇంతకీ.. ఎక్కడ..? ఏమైంది.?
మోత్కూర్, అక్టోబర్ 30 (ఆంధ్రప్రభ) : యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లా మోత్కూర్ మున్సిపల్ పరిధిలోని వీర్లపల్లి బావి సమీపంలో ఎగువన కురిసిన భారీ వర్షానికి పొలాల్లో వరద నీటి ప్రవాహం ఎక్కువైంది. మోత్కూర్ (Motkur) నుండి పనకబండ గ్రామానికి వెళ్లే బి టి రోడ్డుకి గండి పడడంతో ఆ గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి.
గ్రామస్తులు మోత్కూర్ కి వెళ్లాలంటే… రాగిబావి, ముషిపట్ల మీదుగా సుమారు 10 కి.మీ ప్రయాణించి పట్టణానికి రావాల్సి వస్తుంది. సంబంధిత అధికారులు బి టి రోడ్డు వద్ద తక్షణమే మరమ్మతులు చేపట్టి రాకపోకలు పునరుద్ధరించాలని పనకబండ, పుల్లాయి గుడ్, కూరేళ్ల తదితర గ్రామాల గ్రామస్తులు కోరుతున్నారు.

