మొదటి ప్రమాద హెచ్చరిక జారీ..

ఖమ్మం బ్యూరో : ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మున్నేరు నదిలో వరద ప్రవాహం పెరిగింది. బుధవారం రాత్రి 9 గంటల సమయంలో ఖమ్మం కాల్వ ఒడ్డున మున్నేరు 19 అడుగుల ఎత్తుతో ఉధృతంగా ప్రవహిస్తోంది.
వర్షాలు ఎడతెరిపి లేకుండా కొనసాగుతున్న నేపథ్యంలో నదిలో నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసి, లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందస్తు జాగ్రత్త చర్యగా ఖాళీ చేయిస్తున్నారు.
ఖమ్మం నగరంలోని పది డివిజన్లు, అలాగే పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్ మండలంలోని పలు గ్రామాలకు ముంపు ప్రమాదం పొంచి ఉంది. జిల్లా కలెక్టర్ అనుదీప్, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, ఎదులాపురం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి వరద పరిస్థితులను నిరంతరం సమీక్షిస్తున్నారు.
