నేడు 33వ డివిజన్‌లో ఎస్‌ఐఆర్ కార్యక్రమం ప్రారంభం
ఖమ్మం ఆంధ్రప్రభ: రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ తుమ్మల యుగంధర్ ఆదేశాల మేరకు నగరంలోని 33వ డివిజన్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్-2026) కార్యక్రమం శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది.ఈ సందర్భంగా డివిజన్ పరిధిలోని అంగన్‌వాడీ టీచర్లు (బీఎల్‌ఓలు), కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్‌ఏలు) ఓటర్ల ఇళ్ల వద్దకు వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేయనున్నారు. ఫారాల వివరాలను ఓటర్లకు వివరిస్తూ, వాటిని సక్రమంగా పూరించేందుకు అవసరమైన సహాయాన్ని అందించనున్నారు.
ఫారాల నింపడంలో ఏవైనా సందేహాలు ఉన్నా, లేదా వాటిని సరిగా పూరించలేని పరిస్థితుల్లో బీఎల్‌ఓలు, బీఎల్‌ఏలు అందుబాటులో ఉంటారని నాయకులు తెలిపారు.ఓటరు జాబితాల సవరణ ప్రక్రియలో ప్రతి ఓటరు భాగస్వామి కావాలని, ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్ లతీఫ్, కాంగ్రెస్ నాయకులు గోపతి సైదులు, సాదే శంకర్, పిడుగు మల్లికార్జున్, సురేష్ బాబు, శ్రీమాన్, సాదే దివ్య, చీకటిమల్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
