భ‌ద్రాచ‌లం-మారేడుప‌ల్లి మ‌ధ్య రాక‌పోక‌లు బంద్‌

భ‌ద్రాచ‌లం-మారేడుప‌ల్లి మ‌ధ్య రాక‌పోక‌లు బంద్‌

భ‌ద్రాద్రి కొత్త‌గూడెం, ఆంధ్ర‌ప్ర‌భ : తుఫాన్ ఎఫెక్ట్ రెండో రోజు భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లాలో తీవ్ర ప్రభావం చూపించింది.. ఈ రోజు ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా నిరంతరాయంగా వర్షం కురుస్తూనే ఉంది. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. కొన్ని చోట్ల కొండ చరియలు విరిగి పడడంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిపి వేశారు.

భద్రాచలం నుంచి మారేడు మిల్లి ఘాట్ రోడ్(Maredu Milli Ghat Road)లో భారీ వర్షాల కారణంగా రోడ్డు పై మట్టి పెల్లలు పడడంతో అధికారులు యుద్ధ ప్రతిపాదికన తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. సింగరేణి బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం కలిగింది. ఓపెన్ కాస్ట్(Open Cast) గనులు నదులను తలపిస్తున్నాయి.

Leave a Reply