దక్షిణ కాశీలో పోటెత్తిన భక్తజనం..

దక్షిణ కాశీలో పోటెత్తిన భక్తజనం..

బిక్కనూర్, ఆంధ్ర ప్రభ – దక్షిణ కాశీగా పేరు పొందిన సిద్ధి రామేశ్వర ఆలయానికి భక్తులు, పోటెత్తారు. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల కేంద్రంలో గల సిద్ధిరామేశ్వర ఆలయంలో సోమవారం కార్తీక మాస పూజలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. పలు ప్రాంతాల నుండి వేలాదిగా భక్తులు ఆలయానికి తరలివచ్చారు. ఆలయంలో గల మూలభావి నీటితో భక్తులు, తలస్నానాలు చేశారు. అనంతరం ఆలయంలో స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ప్రాంగణంలో పెద్ద ఎత్తున అభిషేకాలు అర్చనలు నిర్వహించారు.

పూజల అనంతరం భక్తులు, సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. ఆలయానికి వచ్చినా భక్తులకు ఇబ్బందులు లేకుండా ఆలయ కార్యనిర్వాక అధికారి శ్రీధర్ ఆలయ పునర్నిర్మాణ కమిటీ అధ్యక్షులు లింబాద్రి ఆధ్వర్యంలో అన్ని వసతులు కల్పించారు. పూజల అనంతరం భక్తులకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

Leave a Reply