ప్రజాదర్బార్ ను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి…
మాజీ ఎమ్మెల్యే సురాజన్
భవానిపురం, ఆగస్టు 6(ఆంధ్రప్రభ): ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని వాటికి వేగవంతమైన పరిష్కారం అందించాలనే సంకల్పంతో ఎమ్మెల్యే సుజనా చౌదరి నిరంతరం ప్రజా దర్బార్ నిర్వహించడం అభినందనీయమని సత్యవేడు మాజీ ఎమ్మెల్యే ఎం సురాజన్ అన్నారు. గురువారం భవానిపురం ఎన్డీయే కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్ లో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, కూటమి నేతలతో కలిసి ఆయన వినతులు స్వీకరించారు. ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడి ప్రతి అర్జినీ పరిశీలించి సమస్యలు, వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్ర భుత్వ పథకాలు, పింఛన్లు, ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు, వైద్య సహాయం, స్థానిక సమస్యలపై ప్రజలు ప్రత్యేకంగా దరఖాస్తులు అందజేశారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సురాజన్ మాట్లాడుతూ ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రజల కష్టసుఖాలను తెలుసుకొని వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం ప్రజా దర్బార్ లను నిర్వహించడం అభినందనీయమన్నారు. ఎమ్మెల్యే కార్యాలయం ప్రతి సమస్యను బాధ్యతగా తీసుకొని పరిష్కారం దిశగా చర్యలు చేపట్టడం హర్షనీయమన్నారు. ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు నున్న కృష్ణ, టీడీపీ క్లస్టర్ ఇన్చార్జ్ ధనేకుల వెంకట సుబ్బారావు, 56 వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు పెద్దిన శ్యామ్ సుందర్ మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి చూపుతున్న ప్రత్యేక చొరవకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని తెలిపారు.
ప్రజల సంక్షేమం, అభివృద్ధే ,ధ్యేయంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే సుజనా చౌదరి నిర్వహిస్తున్న ప్రజాదర్బార్లను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.మాజీ కార్పొరేటర్లు బుల్లా విజయ్ కుమార్, మహ్మద్ అబ్దుల్ ఖాదర్, గుడివాడ నరేంద్ర రాఘవ, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డు నాగలక్ష్మి, బీజేపీ మైనార్టీ మోర్చా వైస్ ప్రెసిడెంట్ షర్మిల, బీజేపీ నాయకులు దుర్బేసుల హుస్సేన్, జనసేన నేత వెంకటేష్ తదితరులు పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు..
