ఇంటింటికీ మొక్కల పంపిణీ
టేకుమట్ల (ఆంధ్రప్రభ): పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెంకట్రావుపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ పెరుమళ్ల చంద్రకళ ఆధ్వర్యంలో గురువారం ఇంటింటికీ మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు వివిధ రకాల మొక్కలను పంపిణీ చేసిన సర్పంచ్, ప్రతి కుటుంబం కనీసం ఒక మొక్కను నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని పెంచి సంరక్షించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని ఆమె పేర్కొన్నారు.
పచ్చదనాన్ని పెంపొందించడం, స్వచ్ఛమైన వాతావరణాన్ని కల్పించడం, భావితరాలకు ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించడం కోసం ప్రతి ఒక్కరూ మొక్కల పెంపకంలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ శ్రీకాంత్, వార్డు సభ్యుడు పవన్, గ్రామ ప్రజలు, మహిళలు, యువకులు పాల్గొని మొక్కలను స్వీకరించారు.
