జాన్ కెనడీకి వైసీపీ నేతల అభినందనలు
నర్సాపురం, ఆంధ్రప్రభ: నర్సాపురం బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ప్రముఖ న్యాయవాది ఇంజేటి జాన్ కెనడీని వైఎస్సార్సీపీ నాయకులు ఘనంగా అభినందించారు. బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు పాల్గొని కెనడీని సత్కరించారు.
ఈ సందర్భంగా ముదునూరి ప్రసాదరాజు మాట్లాడుతూ, ప్రతిష్టాత్మకంగా జరిగిన బార్ అసోసియేషన్ ఎన్నికల్లో న్యాయవాదుల సంపూర్ణ మద్దతుతో జాన్ కెనడీ ఉపాధ్యక్షుడిగా ఎన్నిక కావడం సంతోషకరమన్నారు. రానున్న రోజుల్లో ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు.
ఉపాధ్యక్షుడిగా తన పదవీకాలంలో న్యాయవాదుల సంక్షేమం, బార్ అసోసియేషన్ అభివృద్ధి, న్యాయ సేవల మరింత మెరుగుదలకు కృషి చేయాలని సూచించారు.
కార్యక్రమంలో పార్టీ నాయకులు పి.డి. రాజు, బర్రి శంకర్, ఉంగరాల రమేష్, చిన్నదవేజి, కావలి నాని, అడిదెల శరత్, పులపర్తి ప్రతాప్ తదితరులు పాల్గొని జాన్ కెనడీకి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
