కాలువలోకి దూసుకెళ్లిన కారు

కాలువలోకి దూసుకెళ్లిన కారు

భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ: పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం వేండ్ర గ్రామంలో ఓ కారు వేగంగా కాలువలకు దూసుకెళ్లింది. నవుడూరు నుంచి వేండ్ర వైపు వస్తున్న ఓ కారు వేండ్ర లోని గోస్తని -వేల్పూర్ కాలవ వంతెన సమీపానికి వచ్చే సమయానికి ఎదురుగా ఓ టిప్పర్ వచ్చింది. ఈ టిప్పర్ లారీని తప్పించే క్రమంలో కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ సమయంలో కారులో డ్రైవర్ ఒక్కడే ఉండటం, అతనికి ఎటువంటి గాయాలు కాకుండానే బయటపడ్డారు.

ఈ వంతెన ప్రాంతం ప్రమాదకర మలుపు ఉండటంతో తరచూ ఇక్కడ వాహన ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. వంతెన రైలింగ్ కూడా ఇరువైపులా శిధిలావస్థకు చేరడంతో ఈ వంతెన పై ప్రయాణం భయం భయంగా సాగుతుంది. నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే ఈ వంతెన ప్రాంతంలో రక్షణ చర్యలు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.

Leave a Reply