త్వరలోనే తాగునీటి సమస్య పరిష్కారం

  • రూ.10 లక్షలతో పైపులైన్ ఏర్పాటు

ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ: త్వరలోనే జగనన్న కాలనీలో తాగునీటి సమస్య పరిష్కారం అవుతుందని మున్సిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు తెలిపారు. కొండపల్లి జగనన్న కాలనీ (ఈలప్రోలు లే అవుట్)లో రూ.10 లక్షల నిధులతో అత్యవసరంగా తాగునీటి పైపులైన్ ఏర్పాటు పనులకు బుధవారం శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలాకాలం నుంచి కాలనీ ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఆదేశాల మేరకు ప్రజలకు రక్షిత నీరు సరఫరా చేసేందుకు పైపులైన్ పనులు ప్రారంభించినట్లు తెలిపారు. ప్రజలకు అవసరమైన అన్ని మౌలిక సౌకర్యాలు కల్పిస్తామన్నారు.

కార్యక్రమంలో వైస్ చైర్మన్ చుట్టుకుదురు శ్రీనివాసరావు, పట్టణ టీడీపీ అధ్యక్షుడు కరిమికొండ బాలాజీ, క్లస్టర్ ఇన్ చార్జిలు చనమోలు నారాయణ, చుట్టుకుదురు వాసు, గొల్లపూడి ఏఎంసీ డైరెక్టర్ బసవ ఉమామహేశ్వరరావు, మైలా సైదులు, మేడా శ్రీను తదితరులు పాల్గొన్నారు.