మెరుగైన వైద్యం కోసం బాధితులకు ఎల్ఓసీ పత్రాల పంపిణీ
భవానిపురం, ఆంధ్రప్రభ: పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి వైద్య సహాయానికి అవసరమైన లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్ఓసీ) పత్రాలను మంజూరు చేస్తున్నారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఆయన కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, కూటమి నాయకులతో కలిసి భవానిపురంలోని ఎన్డీయే కార్యాలయంలో మంగళవారం బాధితులకు ఎల్ఓసీ పత్రాలను అందజేశారు.
44వ డివిజన్ చెరువు సెంటర్‌కు చెందిన ఎ. విజయశ్రీ (51) హెర్నియా వ్యాధితో బాధపడుతూ వైద్య సహాయం కోసం దరఖాస్తు చేసుకోగా, ఆమెకు రూ.4 లక్షల విలువైన ఎల్ఓసీని అందజేశారు. అలాగే 53వ డివిజన్‌కు చెందిన అల్లు దుర్గారావు మూత్రపిండాల సమస్యతో చికిత్స పొందేందుకు దరఖాస్తు చేసుకోగా, ఆయనకు కూడా రూ.4 లక్షల విలువైన ఎల్ఓసీ మంజూరైన పత్రాన్ని అందించారు.
తమ విజ్ఞప్తిపై త్వరితగతిన స్పందించి వైద్య సహాయం అందించిన ఎమ్మెల్యే సుజనా చౌదరికి బాధితులు, వారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు ఉమ్మడి వెంకటేశ్వరరావు (చంటి), బుల్లా విజయ్ కుమార్, కూటమి నాయకులు సయ్యద్ సలీం, దళావాయి భార్గవ్, నందే విజయలక్ష్మి, దుర్గాప్రసాద్, తారిక్ అజీజ్, బొమ్ము రాంబాబు, బెన్నాబత్తుల సోమేశ్వరరావు, ఏలూరి సాయి శరత్ తదితరులు పాల్గొన్నారు.
