కనకదుర్గమ్మను దర్శించుకున్న హోంమంత్రి

  • హోం మంత్రి అనితకు అపూర్వ స్వాగతం..
  • కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు
  • ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన చైర్మన్ బొర్రా గాంధీ

ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి వి. అనిత మంగళవారం కుటుంబ సభ్యులతో కలిసి ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇంద్రకీలాద్రికి విచ్చేసిన హోంమంత్రికి ఆలయ అర్చకులు, ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
దర్శనం అనంతరం వేదపండితులు వేదాశీర్వచనం అందించగా, ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, సభ్యులు అవ్వారు శ్రీనివాసరావు, పి. రాఘవరాజు, ఎస్. సరిత, ప్రత్యేక ఆహ్వానితుడు వెలగపూడి శంకరబాబు హోంమంత్రికి అమ్మవారి చిత్రపటంతో పాటు ప్రసాదాలను అందించి ఆలయ మర్యాదలతో సత్కరించారు.