ప్రజా సంక్షేమం అభివృద్ధే కూటమిపాలన

జూలకంటి గౌతమ్

పల్నాడు జిల్లా, ఆంధ్రప్రభ: సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆదేశాల మేరకు, ప్రతి ఇంటింటికి టీడీపీ ప్రచార కార్యక్రమం జూలకంటి గౌతమ్ రెడ్డి 26వ వార్డులో ఇంటింటి ప్రచారం కార్యక్రమం చేపట్టారు. గౌతమ్ రెడ్డిని 58వ బూత్ ఇంచార్జి పల్నాడు జిల్లా పార్లమెంటు సెక్రెటరీ షేక్ జానీ భాష పుష్పగుచ్చం అందించి వార్డులోకి ఘన స్వాగతం పలికారు.

ఈ ప్రచార కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రతి ఇంటి ఇంటికి టీడీపీ ప్రచార కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటింటికి తిరిగి సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రంలో, నియోజకవర్గంలో సాధించిన ప్రగతి వివరాల కరపత్రాలను అందించుకుంటూ వార్డులోని ప్రచారంలో ముందుకు సాగారు. వార్డులోని జరిగిన అభివృద్ధిని, పంచిన సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.

కూటమి ప్రభుత్వం గత రెండేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేసిందని తెలిపారు. ప్రజలకు మెరుగైన పాలన అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.