అంతర్జాతీయ పోటీల్లో అక్షరా స్కూల్ విద్యార్థుల సత్తా…

ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అభినందనలు


ఏలూరు ఎడ్యుకేషన్, ఆగస్టు 4(ఆంధ్రప్రభ) : హైదరాబాద్ వేదికగా జరిగిన 2 వా అంతర్జాతీయ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్‌షిప్‌ 2026 లో ఏలూరు అక్షరా స్కూల్ విద్యార్థులు సత్తా చాటి పతకాలు సాధించారు. ఆదివారం హైదరాబాద్ చంపాపేట్‌లోని లక్ష్మీ గార్డెన్స్‌లో ఈ అంతర్జాతీయ ఛాంపియన్‌షిప్ జరిగింది. ఇందులో పాల్గొన్న యంగ్ మార్షల్స్ సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ కి చెందిన అక్షరా స్కూల్ విద్యార్థులు అద్భుతంగా రాణించారు.

ఈ పోటీల్లో ఆర్. తత్వజ్ఞ – 8 సంవత్సరాలు – బంగారు పతకం..
కె. తేజస్ -11 సంవత్సరాలు – వెండి పతకం సాధించి ఏలూరుకు దక్కిన గౌరవాన్ని మరింత పెంచారు. విద్యార్థుల ఘన విజయంపై ఏలూరు నగర శాసనసభ్యులు బడేటి చంటి ప్రశంసలు కురిపించారు. బాలల వయసులోనే అంతర్జాతీయ స్థాయిలో రాణించడం ఏలూరుకు గర్వకారణమని పేర్కొన్నారు.ఈ విజేతలను అక్షరా స్కూల్ ప్రిన్సిపల్ అర్చన చౌదరి కరస్పాండెంట్ సురేందర్ అభినందించారు. పిల్లల ప్రతిభను మెచ్చుకుంటూ, వారికి వెన్నుదన్నుగా నిలిచిన తల్లిదండ్రులను కూడా అభినందించారు.

అంతేకాకుండా విద్యార్థులకు క్రమశిక్షణతో, పట్టుదలతో శిక్షణ ఇచ్చిన యంగ్ మార్షల్స్ సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ సీనియర్ మాస్టర్ ఆర్. వేణుగోపాల్ శ్రీనివాస్ , మాస్టర్ సాయి కుమార్గార్ల కృషిని ప్రత్యేకంగా కొనియాడారు.ఈ విజయం అకాడమీకి మాత్రమే కాకుండా యావత్ ఏలూరు జిల్లాకే గర్వకారణమని, రాబోయే రోజుల్లో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని కీర్తి తీసుకురావాలని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.