Green signal | ఉద్యోగులకు భారీ ఊరట

Green signal | ఉద్యోగులకు భారీ ఊరట
- రూ.7,059 కోట్ల చెల్లింపులకు గ్రీన్ సిగ్నల్
Green signal | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. పెండింగ్ బకాయిల చెల్లింపుల ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించింది.
ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. గత ప్రభుత్వ కాలం నుంచి పెండింగ్‌లో ఉన్న బకాయిలను విడుదల చేయాలని సూచించారు.
నిధుల లభ్యతను దృష్టిలో ఉంచుకుని చెల్లింపులు చేపట్టేందుకు ఆర్థిక శాఖ కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు రూ.7,059 కోట్ల మేర బకాయిలను విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లింపుల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నిర్ణయం వల్ల వేలాది మంది ఉద్యోగులకు ఉపశమనం లభించనుంది.
