పెండింగ్ ఫీజు బకాయిలు విడుదల చేయాలి
6న జరిగే చలో ఇందిరా పార్క్ మహాధర్నాను విజయవంతం చేయండి: ఎస్ఎఫ్ఐ
పరకాల, ఆంధ్రప్రభ : పరకాల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎస్ఎఫ్ఐ ముఖ్య కార్యకర్తల సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 6న హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహించే చలో ఇందిరా పార్క్ మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వం రూ.10 వేల కోట్ల స్కాలర్‌షిప్‌లు, ఫీజు బకాయిలను విడుదల చేయాలని కోరారు. ప్రైవేట్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న కళాశాలలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహాధర్నాను విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పరకాల పట్టణ అధ్యక్షుడు బొచ్చు ఈశ్వర్, జిల్లా కమిటీ సభ్యులు బొజ్జ హేమంత్, సన్నీ, ఎస్ఎఫ్ఐ నాయకులు అజయ్, విజయ్, అరుణ్, కుమార్, సందీప్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.
