100and200fakenotes | రంగంలోకి దిగిన పోలీసులు!

100and200fakenotes | రంగంలోకి దిగిన పోలీసులు!

100and200fakenotes | ముమ్మరంగా పోలీసుల విచారణ
వ్యాపారులే లక్ష్యంగా దందా
బ్యాంకు కట్టలలోనూ నకిలీ నోట్లు?
ప్రజలకు పోలీసుల హెచ్చరిక

నర్సంపేట ఏప్రిల్ 22 ఆంధ్రప్రభ : నర్సంపేట పట్టణంలో నకిలీ నోట్ల చలామణి వార్తలు స్థానికంగా తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. మార్కెట్‌లో భారీగా నకిలీ కరెన్సీ చెలామణి అవుతోందన్న సమాచారంతో ప్రజలు, వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రద్దీ సమయాలను ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు ఈ నకిలీ నోట్లను చెలామణి చేస్తున్నట్లు తెలుస్తోంది.

ముమ్మరంగా పోలీసుల విచారణ:
గత కొద్ది రోజులుగా పట్టణానికి చెందిన పలువురు యువకులు గంజాయి, నకిలీ నోట్ల రవాణాలో సంబంధాలు కలిగి ఉన్నారన్న అనుమానంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ వ్యవహారంపై లోతుగా ఆరా తీస్తున్నారు. ఇతర రాష్ట్రాలతో సంబంధాలు ఉన్న నెట్‌వర్క్ ఏదైనా ఈ రాకెట్ వెనుక ఉందా అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది.

వ్యాపారులే లక్ష్యంగా..
నకిలీ నోట్ల చలామణిదారులు ప్రధానంగా చిరు వ్యాపారులు, పెట్రోల్ బంకులు, మద్యం దుకాణాలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. రూ. 100, రూ. 200 మరియు రూ. 500 నోట్లను సామాన్య ప్రజలకు అంటగడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రద్దీగా ఉండే వ్యాపార సముదాయాల్లో నోట్లను క్షుణ్ణంగా పరిశీలించకుండానే లావాదేవీలు జరుగుతుండటం వీరికి వరంగా మారుతోంది.

బ్యాంకు కట్టలలోనూ నకిలీ నోట్లు?

100and200fakenotes
100and200fakenotes


నర్సంపేట పట్టణం కేంద్రంగా సాగుతున్న ఈ అక్రమ దందా గ్రామీణ ప్రాంతాలకు కూడా పాకింది. బ్యాంకుల నుంచి తీసుకునే నగదు కట్టలలో, అలాగే బ్యాంకులకు చెల్లించే కట్టలలో కూడా నకిలీ నోట్లు వస్తున్నట్లు కొంతమంది వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా లారీ ట్రాన్స్‌పోర్ట్, మిర్చి, మొక్కజొన్న ఎగుమతి చేసే రైతులు ఈ నకిలీ నోట్ల బారిన పడుతున్నట్లు తెలుస్తోంది.

పోలీసుల విజ్ఞప్తి:
నకిలీ నోట్ల అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీస్ యంత్రాంగం నిరంతరం నిఘా ఉంచిందని నర్సంపేట సీఐ శ్రీనివాస్ తెలిపారు. ఎవరికైనా నకిలీ నోట్లపై అనుమానం కలిగితే వెంటనే ‘డైల్ 100’కు కాల్ చేయాలని లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు. అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

click here to read more

click here to read 100%increasing | యువతను మింగేస్తున్న డ్రగ్స్ మాఫియా

Leave a Reply