మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు
బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పి ఆర్థిక సాయం అందజేత
దండేపల్లి, ఆంధ్రప్రభ : ఇటీవల దండేపల్లి మండలంలోని పలు గ్రామాల్లో మరణించిన వారి కుటుంబాలను మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు సోమవారం పరామర్శించారు.
దండేపల్లి గ్రామానికి చెందిన ఆకుల రాజన్న, నంబాల గ్రామానికి చెందిన నూనె బాలరాజు, రంగంపల్లి గ్రామానికి చెందిన అల్లంల సత్తయ్య, గూడెం గ్రామానికి చెందిన చింతం మల్లేష్ కుటుంబాలను వారి నివాసాలకు వెళ్లి కలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ క్లిష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని సూచించారు.
అనంతరం బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే ఆర్థిక సహాయం అందజేశారు. ప్రభుత్వం తరఫున అందాల్సిన సంక్షేమ పథకాలు, ఇతర సహాయాలు త్వరితగతిన అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.
