గుత్తా సుఖేందర్ రెడ్డికి అమెరికాలో ఘన స్వాగతం

ఆలేరు ప్రాంత అభివృద్ధిని గుర్తుచేసుకున్న ఉదయ్ కుమార్

ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరుకు చెందిన, ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్న దూడల ఉదయ్ కుమార్.. అమెరికా పర్యటనకు వెళ్లిన తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, టీజీడీడీసీఎఫ్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఉదయ్ కుమార్ పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువాలతో సన్మానించి వారికి ఘన స్వాగతం పలికారు.

ఉదయ్ కుమార్ మాట్లాడుతూ.. ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎంపీగా పనిచేసిన సమయంలో గుత్తా సుఖేందర్ రెడ్డి ఆలేరు ప్రాంత అభివృద్ధికి విశేష కృషి చేశారని గుర్తు చేశారు. శాసనమండలి చైర్మన్ హోదాలో అమెరికా పర్యటనకు వచ్చిన సందర్భంగా ఆయనకు స్వాగతం పలకడం ఆనందంగా ఉందన్నారు.

తమకు అమెరికాలో ఆత్మీయ స్వాగతం పలికిన ఉదయ్ కుమార్‌కు గుత్తా సుఖేందర్ రెడ్డి, గుత్తా అమిత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.