Nhrc-Notices : ఆ దుర్ఘ‌ట‌న ఘోరం Andhra Prabha Crime News

Nhrc-Notices : ఆ దుర్ఘ‌ట‌న ఘోరం Andhra Prabha Crime News

  • ఏం చ‌ర్య‌లు తీసుకున్నారు
  • 4 వారాల్లో నివేదిక ఇవ్వండి
  • క‌ర్నూలు ఎస్పీకి నోటీసులు
  • తెర‌మీద‌కు క‌ర్నూలు బ‌స్సు ద‌గ్ధం ..
  • 20 మృతి కేసు విచార‌ణ

(కర్నూలు బ్యూరో , ఆంధ్ర ప్రభ )

Nhrc-Notices గత ఏడాది అక్టోబరు 24న 44వ జాతీయ రహదారిపై కర్నూలు సమీపంలో జరిగిన భయానక బస్సు అగ్నిప్రమాద ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. 20 మందికి పైగా ప్రయాణికులు సజీవ దహనమైన ఈ దారుణ దుర్ఘ‌ట‌న‌పై దాఖలైన ఫిర్యాదును స్వీకరించిన కమిషన్, బాధితుల ప్రాథమిక మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించింది.
ఈ మేరకు ఎన్‌హెచ్‌ఆర్‌సి సభ్యులు ప్రియాంక్ కనూంగోతో కూడిన బెంచ్, మానవ హక్కుల పరిరక్షణ చట్టం-1993లోని సెక్షన్ 12 కింద ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా పరిగణించింది. ఘటనపై సమగ్ర విచారణ జరిపి నాలుగు వారాల్లోగా సమగ్ర చర్యల నివేదికను సమర్పించాలని కర్నూలు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ని ఆదేశిస్తూ జూలై 30న అధికారిక నోటీసులు జారీ చేసింది.
తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు ఈ నోటీసులు జారీ చేశారు.
ప్రైవేట్, ప్రజారవాణా బస్సుల్లో సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే ఈ ఘోరం జరిగిందని ఫిర్యాదు లో పేర్కొన్నారు.
ప్రయాణికుల ప్రాణాలకు రక్షణ కల్పించడంలో విఫలం కావడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కును కాలరాయడమేనని పేర్కొన్నారు.బాధ్యులైన అధికారులతో పాటు సంబంధిత వ్యక్తులపై బిఎన్‌ఎస్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి క్రిమినల్ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
మృతి చెందిన ప్రయాణికుల కుటుంబాలకు రూ10 లక్షల చొప్పున పరిహారం అందించాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కమిషన్ పర్యవేక్షణలో జాతీయ రహదారులపై భద్రతా సంస్కరణలు చేపట్టాలని కోరారు. పోలీస్ శాఖ తమ నివేదికను ఈ మెయిల్ ద్వారా కాకుండా హెచ్ ఆర్ సి నెట్ పోర్టల్ ద్వారా అప్ లోడ్ చేయాలని ఆదేశించింది.