తెలంగాణ కేబినెట్ మార్చి 6న సమావేశం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు.
కులగణన ప్రాతిపదికన రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. పార్లమెంట్‌లో 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదంపై మంత్రివర్గంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
సర్వేలో పాల్గొనని వారి కోసం రాష్ట్రంలో నిర్వహించిన రెండో విడత కుల గణనకు సంబంధించిన గణాంకాలపై మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది. మార్చి 3తో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియనుండటంతో… కొత్త రేషన్ కార్డుల పంపిణీపై మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు పలు అంశాలపై కేబినెట్ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.