Pm-Modi-Wishes : హ్యాపీ బర్త్ డే.. శివ Andhra Prabha Spl News
Pm-Modi-Wishes : హ్యాపీ బర్త్ డే.. శివ Andhra Prabha Spl News
- ఎంపీ చిన్నికి ప్రధాని మోదీ విషెస్
- ఆయురారోగ్యాలతో
- సుదీర్ఘ ప్రజా జీవితం గడపండి
- ప్రత్యేక లేఖతో శుభాకాంక్షలు
(విజయవాడ, ఆంధ్రప్రభ)
Pm-Modi-Wishes : విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ (చిన్ని) జన్మదినం సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా సోమవారం పంపిన లేఖలో ఎంపీ చిన్ని సంపూర్ణ ఆయురారోగ్యాలతో, సుదీర్ఘ ప్రజా జీవితాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు. ప్రజా సేవ పట్ల ఆయన చూపుతున్న అంకితభావం మరింత విస్తరించి, దేశాభివృద్ధి లక్ష్యాలకు తోడ్పడాలని ప్రధాని పేర్కొన్నారు.
అమృత కాలంలో అభివృద్ధి చెందిన భారత నిర్మాణమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్న నేపథ్యంలో, ప్రజల సంక్షేమం, సామాజిక అభ్యున్నతి, జాతీయ పురోగతిలో ఎంపీ కేసినేని చిన్ని మరింత చురుకైన పాత్ర పోషించాలని ప్రధాని మోదీ తన లేఖలో ఆకాంక్షించారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ సేవా కార్యక్రమాలను మరింత విస్తరించాలని సూచించారు.
ప్రధాని మోడీ నుంచి నేరుగా జన్మదిన శుభాకాంక్షలు అందుకోవడం విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గానికి గౌరవకారణమని పార్టీ శ్రేణులు పేర్కొన్నాయి. ఈ సందర్భంగా ఎంపీ చిన్ని అభిమానులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
