ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు
- కుమార్తె వివాహానికి ఆహ్వాన పత్రిక అందజేత
- కుటుంబ సభ్యులతో కలిసి మర్యాదపూర్వకంగా భేటీ
జుక్కల్/కామారెడ్డి, ఆంధ్రప్రభ : జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు శుక్రవారం తన కుటుంబ సభ్యులతో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తన జ్యేష్ఠ కుమార్తె జొనిట వివాహ ఆహ్వాన పత్రికను ముఖ్యమంత్రికి అందజేసి, వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించాలని ఆహ్వానించారు. ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఆహ్వానాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాదరంగా స్వీకరించారు. ఈ భేటీలో ఎమ్మెల్యే సతీమణి తోట అర్చనతో పాటు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
