Breaking news | షూటింగ్లో రష్మికకు గాయాలు…
- డ్యాన్స్ సన్నివేశం చిత్రీకరణలో ప్రమాదం..
- ఆరు వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ప్రముఖ నటి రష్మిక మందన్న సినిమా షూటింగ్ సందర్భంగా గాయపడ్డారు. ఓ డ్యాన్స్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ఆమెకు గాయాలైనట్లు సమాచారం. నడుము భాగంలో బలమైన గాయం కావడంతో వైద్యులు పరీక్షించి చికిత్స అందించారు. గాయం పూర్తిగా నయం కావడానికి కనీసం ఆరు వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు తెలిసింది.
దీంతో ప్రస్తుతం జరుగుతున్న సినిమా షూటింగ్ల షెడ్యూళ్లలో మార్పులు చేసే అవకాశం ఉన్నట్లు సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. అభిమానులు రష్మిక త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
