TG | మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ ..

హైదరాబాద్ – ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్ (Minister Adluri Laxman) బాధ్యతలు స్వీకరించారు. ఇవాళ ఉదయం సచివాలయంలో (Telangana Secretariat) తనకు కేటాయించిన చాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అడ్లూరికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Dy cm bhatti ) , మంత్రులు శ్రీధర్ బాబు (sridhar babu ) , తుమ్మల నాగేశ్వర్‌రావు (tummal nageswararao) , కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (komatireddy venkatareddy ) , పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తోపాటు సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అడ్లూరి మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ దివ్యాంగుల సంక్షేమానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.

Leave a Reply