యూరియా కొరత సృష్టిస్తే చర్యలు: కలెక్టర్ డా. జి. లక్ష్మీశ

  • యూరియా నిల్వలపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
  • అధిక ధరలకు ఎరువులు అమ్మితే ఉపేక్షించం
  • ఎరువుల దుకాణం, అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు తనిఖీ
  • రైతులకు ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశం

తిరువూరు, ఆంధ్రప్రభ: రైతులకు యూరియా కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ హెచ్చరించారు. గురువారం తిరువూరు పట్టణంలోని ఓ ఎరువుల దుకాణాన్ని సందర్శించి యూరియా నిల్వలు, విక్రయాల విధానం, రైతులకు సరఫరా పరిస్థితిని పరిశీలించారు.

ఈ సందర్భంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగినంత ఎరువుల నిల్వలు ఉంచాలని, కృత్రిమ కొరత సృష్టించడం, అధిక ధరలకు విక్రయించడం వంటి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని వ్యాపారులను హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఎరువుల పంపిణీ చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్–తెలంగాణ సరిహద్దులోని అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు తనిఖీ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. అక్కడ అమలవుతున్న తనిఖీ విధానం, సిబ్బంది నిర్వహణ, రికార్డుల నిర్వహణపై ఆరా తీసి అవసరమైన సూచనలు చేశారు.

ఈ సందర్భంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగినంత ఎరువుల నిల్వలు ఉంచాలని, కృత్రిమ కొరత సృష్టించడం, అధిక ధరలకు విక్రయించడం వంటి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని వ్యాపారులను హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఎరువుల పంపిణీ చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

అనంతరం ఆంధ్రప్రదేశ్–తెలంగాణ సరిహద్దులోని అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు తనిఖీ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. అక్కడ అమలవుతున్న తనిఖీ విధానం, సిబ్బంది నిర్వహణ, రికార్డుల నిర్వహణపై ఆరా తీసి అవసరమైన సూచనలు చేశారు. కలెక్టర్ వెంట తిరువూరు ఆర్డీఓ ఎ. కుమార్, తహశీల్దార్ డి. చంద్రమౌళి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. తహశీల్దార్ డి. చంద్రమౌళి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.