Lok Sabha | వందేమాతరంపై కేంద్రం కీలక నిర్ణయం…

Lok Sabha | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: జాతీయ గేయం ‘వందేమాతరం’ కు చట్టపరమైన రక్షణ కల్పించే బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. మూజువాణి ఓటుతో సభ్యులు బిల్లును ఆమోదించారు. ఇప్పటికే ఈ బిల్లు రాజ్యసభలోనూ ఆమోదం పొందింది. ఈ బిల్లు అమల్లోకి వస్తే వందేమాతరాన్ని అవమానించడం, ఆలపిస్తున్న సమయంలో ఉద్దేశపూర్వకంగా ఆటంకం కలిగించడం నేరంగా పరిగణించబడుతుంది.

ఈ మేరకు ‘ది ప్రివెన్షన్ ఆఫ్ ఇన్‌సల్ట్స్ టు నేషనల్ ఆనర్ యాక్ట్–1971’ లో సవరణలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.ప్రస్తుతం జాతీయ గీతమైన ‘జనగణమన’కు ఉన్న చట్టపరమైన రక్షణను ‘వందేమాతరం’ కు కూడా వర్తింపజేయడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశంగా కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.