బీడీ కాలనీలో ఇంటింటికి తెలుగుదేశం
సూళ్లూరుపేట, ఆంధ్రప్రభ: తెలుగుదేశం పార్టీ చేపట్టిన ‘ప్రతి ఇంటికి – ప్రతి కుటుంబానికి ప్రభుత్వం’ లక్ష్యంతో నిర్వహిస్తున్న ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమం గురువారం సూళ్లూరుపేట నియోజకవర్గంలోని నాయుడుపేట మండలం బీడీ కాలనీ, 19, 20 వార్డుల్లో ఘనంగా నిర్వహించారు.
సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవెల విజయశ్రీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలు డాక్టర్ పనబాక లక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమానికి వచ్చిన నాయకులకు స్థానికులు హారతులు ఇచ్చి ఘన స్వాగతం పలికారు.
అనంతరం నాయకులు ఇంటింటికీ వెళ్లి ప్రతి కుటుంబాన్ని కలుసుకుని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సేవలను వివరించారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్ పనబాక లక్ష్మి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ‘ప్రతి ఇంటికి – ప్రతి కుటుంబానికి ప్రభుత్వం’ అనే లక్ష్యంతో ప్రజలకు సుపరిపాలన అందిస్తూ, ప్రతి అర్హ కుటుంబానికి సంక్షేమ పథకాల ఫలాలు చేరేలా కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల గడప వద్దకే తీసుకెళ్లి వారి అభిప్రాయాలు తెలుసుకోవడం, సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సంతృప్తి వ్యక్తం చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ వైస్ ప్రెసిడెంట్ యశ్వంత్ రెడ్డి, పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ముని రామయ్య, క్లస్టర్ ఇన్‌చార్జీలు, క్లస్టర్ నాయకులు, వార్డు నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
