బండ్ పార్క్‌ను ప్రారంభించిన మంత్రులు

వేములవాడ, ఆంధ్రప్రభ: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ గుడి చెరువు వద్ద నిర్మించిన నూతన బండ్ పార్క్‌ను రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సహచర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, సంజయ్, మేడిపల్లి సత్యం తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రజలకు అందుబాటులోకి వచ్చిన బండ్ పార్క్‌ను సందర్శించిన ప్రజాప్రతినిధులు అక్కడ ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు. ఆలయానికి వచ్చే భక్తులతో పాటు స్థానిక ప్రజలకు ఆహ్లాదకరమైన విహార వేదికగా ఈ పార్క్ ఉపయోగపడుతుందని వారు తెలిపారు. గుడి చెరువు పరిసరాల సుందరీకరణతో పాటు వేములవాడను మరింత ఆకర్షణీయమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో బండ్ పార్క్ కీలక మైలురాయిగా నిలుస్తుందని నాయకులు పేర్కొన్నారు. ప్రజలు ఈ పార్క్‌ను పరిరక్షిస్తూ వినియోగించుకోవాలని వారు కోరారు.