ప్రపంచ నంబర్‌వన్‌గా శుభ్‌మన్ గిల్..
న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : భారత వన్డే జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మరోసారి ప్రపంచ నంబర్‌వన్ వన్డే బ్యాటర్‌గా అవతరించాడు. తాజాగా విడుదలైన ఐసీసీ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని తిరిగి సొంతం చేసుకున్నాడు. ఇంగ్లండ్‌తో ఇటీవల ముగిసిన మూడు వన్డేల సిరీస్‌లో 188 పరుగులు చేసి అద్భుత ప్రదర్శన కనబర్చడంతో న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ను వెనక్కి నెట్టి తొలి స్థానానికి చేరుకున్నాడు.
గిల్ ఇప్పటివరకు భారత్ తరఫున 67 వన్డేల్లో 3,379 పరుగులు చేశాడు. ఇందులో 9 సెంచరీలు, 20 అర్ధ సెంచరీలు ఉన్నాయి. సగటు 60.33తో వన్డే క్రికెట్‌లో అత్యంత నిలకడైన బ్యాటర్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు.
2023 వన్డే ప్రపంచకప్ సందర్భంగా గిల్ కేవలం 38 ఇన్నింగ్స్‌ల్లోనే 2,000 పరుగులు పూర్తి చేసి, హషీమ్ ఆమ్లా పేరిట ఉన్న 40 ఇన్నింగ్స్‌ల రికార్డును అధిగమించాడు. అదే ఏడాది 23 ఏళ్ల వయసులో వన్డేల్లో ద్విశతకం సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా కూడా చరిత్ర సృష్టించాడు. న్యూజిలాండ్‌పై 149 బంతుల్లో 208 పరుగులతో ఆ అరుదైన ఘనతను అందుకున్నాడు.
