Novak Djokovic | వింబుల్డన్‌లో జొకోవిచ్ చరిత్ర..
ఫెడరర్ రికార్డుకు సమం
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : వింబుల్డన్‌లో మరోసారి తన ఆధిపత్యాన్ని చాటిన సెర్బియా టెన్నిస్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్ చరిత్రలో నిలిచే ఘనతను అందుకున్నాడు. టోర్నీలో 105వ మ్యాచ్‌ను గెలిచి పురుషుల సింగిల్స్‌లో అత్యధిక విజయాలు సాధించిన రోజర్ ఫెడరర్ రికార్డును సమం చేశాడు. అయితే వింబుల్డన్ చరిత్రలో మహిళలు, పురుషులు కలిపి అత్యధిక సింగిల్స్ విజయాల రికార్డు మాత్రం మార్టినా నవ్రతిలోవా పేరిటే కొనసాగుతోంది. ఇక టోర్నీ చరిత్రలో మహిళలు, పురుషులు కలిపి అత్యధిక సింగిల్స్ విజయాల రికార్డు మాత్రం దిగ్గజ టెన్నిస్ క్రీడాకారిణి మార్టినా నవ్రతిలోవా పేరిటే కొనసాగుతోంది. ఆమె వింబుల్డన్‌లో మొత్తం 120 సింగిల్స్ విజయాలు సాధించి ఇప్పటికీ అగ్రస్థానంలో నిలిచారు.
