869RatingPoints | బౌలింగ్‌లో బుమ్రా

869RatingPoints | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌లో బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో ఆసక్తికర మార్పులు చోటుచేసుకున్నాయి. ఇంగ్లండ్ యువ సంచలనం హ్యారీ బ్రూక్ అద్భుత ప్రదర్శనతో ప్రపంచ నెంబర్‌వన్ టెస్ట్ బ్యాటర్‌గా అవతరించగా, అతని సహచరుడు జోరూట్ ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు కోల్పోయాడు. మరోవైపు భారత ఆటగాళ్లు రిష‌బ్ పంత్‌, జైశ్వాల్ టాప్ 15లో కొన‌సాగుతున్నారు.

తాజా ఐసీసీ టెస్ట్ బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ 869 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. లార్డ్స్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 56 పరుగులు సాధించిన బ్రూక్ తన ర్యాంకును మరింత బలోపేతం చేసుకున్నాడు.

ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ 853 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. కాగా, న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన జో రూట్ రెండు స్థానాలు దిగజారి 851 పాయింట్లతో మూడో స్థానానికి చేరుకున్నాడు.

భారత్ తరఫున యువ ఓపెనర్ య‌శ‌స్వి జైస్వాల్ 733 పాయింట్లతో టాప్-10లో నిలిచి 9వ స్థానంలో కొనసాగుతున్నాడు. అఫ్గానిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్ట్‌లో అతను పెద్ద స్కోరు నమోదు చేయలేకపోయినా తన స్థానం నిలబెట్టుకున్నాడు. అదే మ్యాచ్‌లో 81 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడిన వికెట్‌కీపర్ బ్యాటర్ రిష‌బ్ పంత్‌ ఒక స్థానం మెరుగుపరుచుకుని 12వ ర్యాంక్‌కు చేరుకున్నాడు.

ఇక అఫ్గానిస్థాన్‌పై భారత్ ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన శుభ‌మ‌న్ గిల్ (126), కేఎల్ రాహుల్ (100) సెంచరీలతో జట్టును బలమైన స్థితిలో నిలిపారు. భారత బ్యాటర్లు నిలకడగా రాణిస్తుండటంతో రానున్న రోజుల్లో ర్యాంకింగ్స్‌లో మరిన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది.

నెంబర్ వ‌న్‌ స్థానంలోనే బుమ్రా
భారత స్టార్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో, అలాగే రవీంద్ర జడేజా టెస్ట్ ఆల్‌రౌండర్ల జాబితాలో తమ నంబర్-1 స్థానాలను విజయవంతంగా కాపాడుకున్నారు. అఫ్గానిస్తాన్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో వీరిద్దరికీ విశ్రాంతినిచ్చినప్పటికీ, ర్యాంకింగ్స్‌లో వీరి స్థానాలకు ఎలాంటి ఢోకా లేకుండా పోయింది.

Leave a Reply