కర్ణాటక సీఎం తో ఉత్తమ్ భేటీ..
- అంతర్రాష్ట్ర జలాల అంశాలపై కీలక చర్చ..
న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఢిల్లీలోని కర్ణాటక భవన్లో తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ కూడా పాల్గొన్నారు. సమావేశంలో తెలంగాణ–కర్ణాటక మధ్య అంతర్రాష్ట్ర నదీ జలాల అంశాలు, ముఖ్యంగా తుంగభద్ర, కృష్ణా నదుల జలాల వినియోగం, పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. రెండు రాష్ట్రాల మధ్య జలాల నిర్వహణ, సమన్వయం వంటి అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నట్లు తెలిసింది. ఈ భేటీ మర్యాదపూర్వకంగానే జరిగినప్పటికీ, అంతర్రాష్ట్ర జలాల అంశాలపై చర్చ జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.
