చెరువు కాదు… బడి

పెద్దపల్లి, ఆంధ్రప్రభ : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో పెద్దపల్లి జిల్లాలోని రాఘవాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణం చెరువును తలపించింది. బుధవారం ఉదయం పాఠశాలకు వచ్చిన విద్యార్థులు నీటిలోనే నడుచుకుంటూ లోపలికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

పాఠశాల ఆవరణ మొత్తం వర్షపు నీటితో నిండిపోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రాంగణంలో నీరు నిల్వ ఉండటంతో తరగతి గదులకు చేరుకోవడమే సవాలుగా మారింది. పాఠశాల పరిసరాల్లో వర్షపు నీరు నిల్వ కాకుండా శాశ్వత పరిష్కారం కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు సంబంధిత అధికారులను కోరుతున్నారు.