దుర్గామాత ఆలయంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రత్యేక పూజలు

గురువుల ఆరోగ్యం, ఆయురారోగ్యాల కోసం ప్రార్థనలు

ఇచ్చోడ, ఆంధ్రప్రభ: గురుపౌర్ణమి సందర్భంగా బుధవారం నెరడిగొండ మండలంలోని రాజురా గ్రామంలో ఉన్న దుర్గామాత ఆలయాన్ని ఖానాపూర్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ తనకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులందరూ ఆరోగ్యంగా, ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. గురువుల సేవలు సమాజానికి ఆదర్శప్రాయమని, వారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో నెరడిగొండ మాజీ ఉప సర్పంచ్ దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.