మెరుగైన వైద్యం కోసం ఎల్ ఓసీ పత్రాలు అందజేత..

భవానిపురం, ఆంధ్రప్రభ : ప్రజల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఎమ్మెల్యే సుజనా చౌదరి లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్‌వోసీ) పత్రాలను మంజూరు చేస్తున్నారు.

ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాల మేరకు కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, మాజీ కార్పొరేటర్లు మరుపిళ్ల రాజేష్, అత్తలూరి ఆదిలక్ష్మి పెదబాబు, కూటమి నాయకులతో కలిసి భవానిపురంలోని ఎన్డీఏ కార్యాలయంలో బాధితులకు ఎల్‌వోసీ పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా 51వ డివిజన్కు చెందిన గొల్లపల్లి సామ్యూల్ (65) గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ వైద్యసాయం కోసం దరఖాస్తు చేసుకోగా, రూ.6.95 లక్షల విలువైన ఎల్‌వోసీని అందజేశారు. అలాగే 52వ డివిజన్ బ్రాహ్మణ వీధికి చెందిన మామిడి శివ (39) హెర్నియా శస్త్రచికిత్స కోసం దరఖాస్తు చేసుకోగా, రూ.4.31 లక్షల విలువైన ఎల్‌వోసీని అందించారు.

అదేవిధంగా 52వ డివిజన్ కొత్తపేటకు చెందిన రిక్కా తాతారావు హిప్ రీప్లేస్‌మెంట్ శస్త్రచికిత్స కోసం వైద్యసాయం కోరగా, రూ.2.47 లక్షల విలువైన ఎల్‌వోసీని కూటమి నాయకులతో కలిసి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు నున్న కృష్ణ, కూటమి నాయకులు బాదర్ల శివ, శనివారపు శివ తదితరులు పాల్గొన్నారు.