బోనాలు.. తెలంగాణ సంస్కృతికి చిరస్మరణీయ ప్రతీక
బోనాలు.. తెలంగాణ సంస్కృతికి చిరస్మరణీయ ప్రతీక
బోనాల పండుగ ఆవిర్భావం.. చారిత్రక విశిష్టత
ఆషాఢ బోనాల ఆచారాలు, పోతరాజు ప్రాధాన్యం
2026 ఆషాఢ బోనాల ఉత్సవాల తేదీలు
గ్రామదేవతల పూజలకు ఉద్దేశితమైనది, తెలుగు జానపదుల సాంస్కృతిక వైభవానికి ఉత్తుంగ శిఖరంలా నిలుస్తున్నది బోనాల పండుగ. ఇది తెలంగాణ సాంప్రదాయాల ప్రత్యేకతను, విశిష్టతను చాటి చెప్పే పండగ. జూలై లేదా ఆగస్టు మాసంలో వచ్చే ఆషాడం వచ్చిందంటే, తెలంగాణలోని అన్ని ప్రాంతాలలో జాతర సందడి నెలకొంటుంది. ఎక్కడ చూసినా భక్తిశ్రద్ధలతో మహిళలు సమర్పించే బోనాలే దర్శనమిస్తాయి. ప్రాచీన కాలంలో ఋతువులు మారి, ఆషాడంలో వర్షాలు కురిసి, వాతావరణ మార్పులతో, కలరా, ప్లేగు లాంటి మహమ్మారి వ్యాధులు సంక్రమించే క్రమంలో, వైద్య సౌకర్యాలు లేని స్థితిలో, దేవతలను కొలవడం జరిగేది. 1813లో భాగ్యనగరంలో వేలాది మంది గురైన సందర్భంలో, మహంకాళిని కొలవడం వల్ల వ్యాధి తగ్గుముఖం పట్టిందని, అప్పటి నుండి రాష్ట్ర రాజధానిలోనూ, బోనాల పండుగ నిర్వహిస్తున్నట్లు వాడుక. గోల్కొండ కోటలో జగదాంబికా ఆలయంలో, అబుల్ హసన్ తానీషా పాలనా సమయంలో, ప్రధాని సైనికాధికారులుగా ఉన్న అక్కన్న, మాదన్నల కాలంలో, బోనాల ఉత్సవాలు ప్రారంభమైనట్లు కథనాలు. 1908లో మూసీకి వరదలు వచ్చినప్పుడు, నిజాం మీర్ మెహబూబ్ అలీ ఖాన్, మంత్రి కిషన్ ప్రసాద్‌ను ఏమి చేయాలని సలహా కోరగా, ఇది అమ్మవారి ఆగ్రహం ఫలితమేనని, ఆమెను శాంతింప చేయడానికి పూజలు నిర్వహించాలని మంత్రి వివరించిన సందర్భంలో, నిజాం ప్రభువు లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులు, ముత్యాలు, పట్టు వస్త్రాలు సమర్పించి పూజలు నిర్వహించిన ఫలితంగా, వరదలు తగ్గుముఖం పట్టాయని చెబుతారు. తర్వాత కాలంలో స్థానికులు ఆలయాన్ని పునరుద్ధరించి, 1968లో కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురువులచే విగ్రహ ప్రతిష్ట చేయించడం జరిగింది. 7వ నిజాం కాలం నుండి, సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి ఆలయంలో, బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లో ప్రస్తుతం వందలాది చిన్న, పెద్ద ఆలయాలలో ఉత్సవాలు కొనసాగుతున్నాయి.
ఇవ్వడం జరిగేది. నేడు యాటల పేరున మేకలను లేదా కోడిపుంజులను బలి ఇవ్వడం ఆచారమైంది. పండుగ సందర్భంగా, స్త్రీలు కొత్త బట్టలు, పట్టు చీరలు, నగలు ధరించి, బోనాలు మోస్తూ వెళుతుండగా, మోసుకెళ్తున్న కొందరికి పూనకం (అమ్మవారు ఆవహిస్తారని నమ్మకం) రాగా, వారిని శాంతింప చేసేందుకు, ఆలయ సమీపాన వారి పాదాలపై నీళ్లు కుమ్మరిస్తారు.
అమ్మవారి సోదరుడైన పోతరాజును, ప్రతిబింబించే ఒక బలికాయుడు, ఒంటిపై, నుదుటిపై కుంకుమ, గజ్జెలు ధరించి, చిన్న ధోవతి ధరించి, వాద్య ధ్వనులకు అనుగుణంగా నర్తిస్తాడు. పూజారంభకునిగా, భక్తజన రక్షకునిగా భావించబడతాడు. కొరడాలతో కొట్టుకుంటూ, వేపాకులను చుట్టుకుని, పూనకం వచ్చిన భక్తులను అమ్మవారి సన్నిధికి తీసుకెళ్తాడు. అమ్మవారికి నివేదన అనంతరం విందు భోజనాలు ఆరగిస్తారు. ఈ కార్యక్రమంలో జాతర అనంతరం, పోతరాజుకూ పూనకం రాగా, వికృతమైన ఆగ్రహాన్ని శాంతపరచుటకు, కొమ్ములున్న మేకపోతును అందించగా, పోతరాజు తన దంతాలతో మేక తల మొండెం వేరు చేసి పైకి ఎగరవేస్తారు. పండుగ మొదటి రోజు నుండి, చివరి నిమజ్జనం దాకా, అత్యంత భక్తి తత్పరతతో వాతావరణం ఉంటుంది. బోనాల సమర్పణ వల్ల, ప్రధానంగా దేవతలు శాంతించి, అంటురోగాల బారిన పడకుండా కాపాడుతారని భక్తుల విశ్వాసం.
తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన 2026 ఆషాఢ బోనాలు జూలై 16 నుండి ఆగస్టు 13 వరకు వైభవంగా జరుగుతాయి. తొలి బోనం జూలై 16న గోల్కొండ కోటలో ప్రారంభం కాగా, ప్రధాన ఉత్సవాలు ఆషాఢ ఆదివారాలైన జూలై 19, 26 మరియు ఆగస్టు 2, 9 తేదీల్లో నగరంలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగుతాయి.
