Govt | కాపు, బీసీ భవనాల నిర్మిస్తా

Govt | కాపు, బీసీ భవనాల నిర్మిస్తా
నా సొంత నిధులు వెచ్చిస్తున్నా
రాష్ట్ర మంత్రి టి.జి భరత్
Govt | కర్నూలు, ఆంధ్రప్రభ : సొంత నిధులతో కాపు , బీసీ భవనాల నిర్మాణాలను పూర్తి చేయటానికి కృషి చేస్తున్నామని పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్(Food processing) శాఖ మంత్రి టి.జి భరత్ పేర్కొన్నారు. ఈ రోజు కర్నూలు పట్టణ బి – కాంప్ లో ముందుగా కాపు భవనం, బీసీ భవనాల పునః నిర్మాణానికి మంత్రి టి.జి. భరత్ పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…2014 సంవత్సరం కాలం లో ఉన్న అప్పటి తెలుగుదేశ ప్రభుత్వం కాపు , బీసీ భవనాలు నిర్మాణానికి చర్యలు చేపట్టినదని నిధులు కేటాయించి నిర్మాణాలు బేస్ లెవెల్ స్థాయికి తీసుకొని రావటం జరిగిందని తెలిపారు. 2019 సంవత్సరం తర్వాత వచ్చిన ప్రభుత్వం(Govt) ఈ పనులను అర్ధాంతరంగా ఆపివేయడం, నిధులు కేటాయించకపోవడంతో కాపు, బీసీ ల మనోభావాలు దెబ్బతిన్నవని తెలిపారు.
2024 ఎన్నికల సమయంలో ప్రచారానికి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో దట్టమైన చెట్లపొదలు , గుంతలతో ఉన్నదని అప్పుడే వారికి ఈ రెండు భవనాలు పూర్తి చేసే చర్యలు తీసుకుంటామని వాగ్దానం చేయడం జరిగిందని , ఆ వాగ్దానం మేరకు ఇప్పుడు కాపు భవన నిర్మాణ నిమిత్తం ఒక కోటి 50 లక్షల రూపాయలు(Rs 1 crore 50 lakh), బి.సి. భవనానికి 2 కోట్ల రూపాయలు టీజీవి సంస్థల ద్వారా నిధులు కేటాయించి ఎనిమిది నెలల్లో కాంట్రాక్టర్ ప్రభాకర్ ద్వారా నాణ్యతతో కూడిన పనులతో పార్కింగ్ ప్రదేశం తో సహా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి టి.జి. భరత్ తెలియజేశారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chief Minister Nara Chandrababu Naidu) కెప్టెన్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ను అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నారని తెలియజేశారు. మంత్రులుగా మేము కేంద్ర ప్రభుత్వ మంత్రులతో సమావేశాలు నిర్వహించుకుని రాష్ట్రానికి చేయవలసిన అభివృద్ధికి తీవ్రమైన కృషి చేస్తున్నామని తెలిపారు.
ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్ కు ఇప్పటివరకు పదివేల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొని రావడం జరిగిందని, 7వేల కోట్ల రూపాయలతో అగస్త్య కంపెనీ వస్తూ ఉన్నదని , ప్రపంచంలోనే అతిపెద్ద రెండవ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ రిలయన్స్ కంపెనీ ద్వారా తీసుకుని రావడం జరిగిందని , ఇంకా చాలా కంపెనీలు తీసుకుని వస్తామని మంత్రి తెలిపారు.
కాపు భవనం పూర్తి అయిన తర్వాత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ద్వారా ప్రారంభోత్సవం చేయిస్తామని మంత్రి తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ప్రభుత్వం ఎక్కువ కాలం అధికారంలో ఉండడం వలన హైదరాబాద్(Hyderabad) అన్ని విధాల గణనీయమైన అభివృద్ధి చెంది ఇప్పుడు దేశానికే తలమానికంగా ఉన్నదని తెలియజేశారు.

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి స్థిరమైన ఎక్కువ కాలం ఉండే ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని, ఆ విధంగా స్థిరమైన ప్రభుత్వాలు ఉండడం వల్లనే సింగపూర్, జపాన్, దుబాయి దేశాలు, గుజరాత్ వంటి రాష్ట్రాం అభివృద్ధి చెందాయని తెలుపారు.
కర్నూలు పట్టణంలో రోడ్లను అభివృద్ధి(development) చేస్తూ అవసరమైన ప్రదేశాల్లో రోడ్డు వెడల్పు చేస్తూ ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించే చర్యలు చేపడుతున్నామని మంత్రి తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న సేవలు గుర్తుంచుకుని, ప్రభుత్వానికి అన్ని విధాలుగా ఎల్లప్పుడు అండగా ఉండి ఆశీస్సులు అందించాలని కోరారు.
కాపు భవన పూజా కార్యక్రమం కార్యక్రమంలో కాపు /బలిజ నాయకులు నారాయణరెడ్డి, డాక్టర్ కుళ్లాయప్ప, పత్తి ఓబులయ్య (Patti Obulaiah), లక్ష్మన్న, రవి , రామకృష్ణ , సోమశేఖర్, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు చింతామోహన్, ఆర్కిటెక్ట్ రఘునాథ రెడ్డి మొదలగువారు పాల్గొన్నారు.
బీసీ భవన పూజా కార్యక్రమంలో అడ్వకేట్ శ్రీధర్, నక్కమిట్టల శ్రీనివాసులు, రాంబాబు, రామకృష్ణ , బీసన్న తదితరులు పాల్గొన్నారు. ఈ రెండు పూజా కార్యక్రమాలకు బీసీ వెల్ఫేర్ అధికారిని ప్రసూన(Prasuna, officer), బీసీ కార్పొరేషన్ ఈడీ జాకీర్ మొదలగు అధికారులు పాల్గొన్నారు.
