ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పై అవగాహన

  • సుజనా మిత్ర కోఆర్డినేటర్లకు అవగాహన కల్పించిన సీఎల్ టీసీ సమత..

భవానిపురం, ఆంధ్రప్రభ : ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో పశ్చిమ నియోజకవర్గంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన2.0 మరియు ఏపీ టిడ్కో ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఎంపిక పారదర్శకంగా జరపడానికి సుజనా మిత్రా కోఆర్డినేటర్లు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ , కూటమి నేతలతో కలిసి భవానిపురం ఎన్డీయే కార్యాలయంలో నిర్వహించిన
ఈ కార్యక్రమంలో ఏపీ టిడ్కో, సీ ఎల్ టీ సీ సమత పాల్గొని సుజనా మిత్ర కోఆర్డినేటర్లకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా సమత మాట్లాడుతూ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను ఏపీ టిడ్కో వెబ్సైట్ నందు పొందుపరచడం, ప్రిలిమినరీ డిమాండ్ సర్వే, మరియు అర్హత ప్రమాణాలు, తదితర విషయాలపై అవగాహన కల్పించారు. ఏపీ టిడ్కో వెబ్సైట్, పీ ఎం ఏ వై 2.0 లో దరఖాస్తుదారులు స్వతహాగా నమోదు చేసుకునే విధానం గురించి వివరించారు. దరఖాస్తుదారులకు ఉండవలసిన అర్హత ప్రమాణాలు, రేషన్ కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం తదితర విషయాలను సుజనా మిత్రాలకు వెల్లడించారు. మాజీ కార్పొరేటర్ పైడి మాల సుభాషిణి , పోతిన భేసు కంటేశ్వరుడు, కామ దేవరాజ్, బొల్లేపల్లి కోటేశ్వరరావు పాల్గొన్నారు..