నకిలీ ఎరువుల గుట్టురట్టు…

— హైదరాబాద్ నకిలీ డిఎపి ఎరువుల తయారీ గోడౌన్ లలో పోలీస్ తనిఖీలు
— పెద్ద ఎత్తున నకిలీ డిఎపి ఎరువులు గుర్తింపు

హుజూర్‌నగర్, ఆంధ్రప్రభ : సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని మఠంపల్లి మండలం రఘునాధపాలెం లో విచ్చలవిడిగా నకిలీ డిఏపి, ఎరువులు విక్రయిస్తు పట్టుబడిన నకిలీ ఎరువుల దందాపై మఠంపల్లి మండలం వ్యవసాయ పోలీస్ శాఖ అధికారులు హైదరాబాద్ లోని అబ్దుల్లాపూర్ పెద్దఅంబర్ పేట లో ఒక పాత కోళ్లఫారం గోడౌన్ లలో చేపడుతున్న విచారణలో విస్తృత పోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి.

శనివారం హుజూర్ నగర్ సిఐ జి.చరమందరాజు మఠంపల్లి ఎస్ఐ ప్రవీణ్ ఆద్వర్యంలో ల హైదరాబాదు లోని పెద్ద అంబర్ పేట లోని హరితహరం కాలనీలో నకిలీ ఎరువులు తయారీ కేంద్రాలప దాడులు చేయగా భారీగా నకిలీ ఎరువులు తయారు చేస్తున్న ట్లు గుర్తించారు. ఈ ముఠా వెనుక ఉన్న మాఫియా ఎవరనేది విచారణలో తేలనుంది. ఇప్పటికే తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలోని వారు ఎంచుకున్న డీలర్ల ద్వారా నకిలీ డిఎపి ఎరువులు సుమారు 10 కోట్ల రూపాయల మేర అమ్మకాలు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారుల విచారణలో అవి పూర్తిగా నకిలీ డిఎపి ఎరువులు గా నిర్దారణ చేసినట్లు సమాచారం.