India-Plastic-Currency : ఇక నోట్లు చిర‌గ‌వు Andhra Prabha Top Story

India-Plastic-Currency : ఇక నోట్లు చిర‌గ‌వు Andhra Prabha Top Story

  • న‌కిలీ క‌రెన్పీ బెడ‌ద నో
  • త్వరలో ప్లాస్టిక్ న‌గ‌దు
  • ఆర్బీఐ సహ్నాహాలు
  • గ్లోబ‌ల్ టెండ‌ర్ ఆహ్వానం
  • చైనా..పాకిస్థాన్ కంపెనీల‌కు నో చాన్స్
  • దేశీయంగానే తయారీ య‌త్నం
  • టెక్నాలజీ బ‌దిలీ కోసమే

( ఆంధ్ర‌ప్ర‌భ‌, బిజినెస్ డెస్క్ )

చిల్లు నోట్లు.. చిరిగిన నోట్ల‌తో త‌ప్ప‌లు ప‌డుతున్నారా? ప‌నికి రాని నోట్ల‌తో ఇబ్బంది ప‌డుతున్నారా? వాటిపి మార్చ‌టానికి సంగం డ‌బ్బులు క‌మీష‌న్ అడుగుతున్నారా? న‌కిలీ నోట్ల‌ని తిరిగి ఇచ్చేస్తున్నారా? ఏటీఎంల్లోనూ ర‌కిలీ నోట్లు ద‌ర్శ‌నం ఇస్తున్నాయా? ఇక ఈ తంటాలు ఉండ‌వుజ భార‌త ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప్లాస్టిక్ క‌రెన్సీని తెర మీద‌కు తీసుకువ‌స్తోంది. 2027 నాటికి కొత్త నోట్ల పండ‌గ రానుంది.

India-Plastic-Currency : నిజ‌మా? ఔను ప‌చ్చి నిజం

భార‌తీయుల జేబుల్లోకి త్వరలోనే ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు రానున్నాయి. ఈ మేరకు ఆర్బీఐ -సన్నాహాలు ప్రారంభించింది. ఈ కొత్త నోట్లను ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకురానుంది. దేశ కరెన్సీ వ్యవస్థలో అతిపెద్ద మార్పులకు ఆర్బీఐ పునాది వేస్తోంది. సంప్రదాయ కాగితపు నోట్ల స్థానంలో మరింత మన్నికైన పాలిమర్ నోట్లను తీసుకురానుంది. దేశంలో నోట్ల ముద్రణ సంస్థల్లో ఒకటైన భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్ దేశంలో పాలిమర్ నోట్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ప్రపంచ వ్యాప్త ఆసక్తి పెంచే ఈ ప్రకటన ఎక్స్ ప్రెస్ ఆఫ్ ఇంట్రెస్ట్-ఈఐఓ జారీ చేసింది. భార‌త ప్ర‌భుత్వం అధికారికంగా అడుగులు వేస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన కరెన్సీ ప్రింటింగ్ సంస్థ BRBNMPL జూలై 17, 2026న ఒక గ్లోబల్ ఎక్స్‌ప్రెస్ ఆఫ్ ఇంట్రెస్ట్ (Global EOI) జారీ చేసింది. నోట్ల ముద్రణకు ప్రస్తుతం జరుగుతున్న అసలు ప్లాన్ ఏమిటంటే.. ..
ప్రాథమిక సమాచారం మేర‌కు మొదటగా రూ. 10 లు, రూ. 20 నోట్లను తొలుత పాలిమర్ (ప్లాస్టిక్) రూపంలో తీసుకురావాలని భావిస్తున్నారు. దీని కోసం దాదాపు 68,000 రీముల ప్రత్యేక ప్లాస్టిక్ షీట్లను సరఫరా చేయగల కంపెనీల కోసం చూస్తున్నారు.

India-Plastic-Currency : తెర మీద‌కు కొత్త ప్ర‌యోగం..

వెంటనే అందరికీ ఈ నోట్లు అందుబాటులోకి రావు.పైలట్ ప్రాజెక్ట్ (ట్రయల్స్): మొదటగా కొంత మొత్తంలో పాలిమర్ నోట్లను ముద్రించి, మార్కెట్‌లో ప్రయోగాత్మకంగా (Pilot Rollout) విడుదల చేస్తారు. ఆ ట్రయల్స్ సక్సెస్ అయి, నోట్లు దేశ వాతావరణానికి, ప్రజల వాడకానికి తట్టుకోగలవని రుజువైతే. 2027 నాటికి పూర్తిస్థాయిలో ప్లాస్టిక్ నోట్లను చలామణిలోకి తీసుకువస్తారు.

India-Plastic-Currency : ఎక్కువ కాలం మ‌న్నిక

: ప్రస్తుతం జ‌నం వాడుతున్న కాటన్ పేపర్ నోట్లతో పోలిస్తే, పాలిమర్ నోట్లు 4 నుండి 5 రెట్లు ఎక్కువ కాలం పాడవకుండా ఉంటాయి. చిరగవు, నానవు: ఈ నోట్లు నీటిలో నానినా, పొరపాటున వాషింగ్ మెషీన్‌లో పడినా ఏమీ కావు. త్వరగా చిరగవు, మురికిని కూడా అంటుకోనివ్వవు.

India-Plastic-Currency : నకిలీ నోట్లకు చెక్

ప్లాస్టిక్ నోట్లలో పారదర్శక విండోస్ , ప్రత్యేక హోలోగ్రామ్స్ వంటి అత్యాధునిక సెక్యూరిటీ ఫీచర్లను అమర్చవచ్చు. వీటిని కాపీ కొట్టి నకిలీ నోట్లుసృష్టించడం దాదాపు అసాధ్యం.

India-Plastic-Currency : ఆ రెండు దేశాల‌కు నో చాన్స్

ఈ EOI లో కేంద్ర ప్రభుత్వం ఒక కఠిన రూల్ పెట్టింది. ఈ నోట్ల తయారీకి కావాల్సిన ముడిసరుకును చైనా లేదా పాకిస్తాన్ నుండి తీసుకోకూడదు, ఆ దేశాలతో లింక్ ఉన్న కంపెనీలకు ఇందులో చోటు లేదు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్, సింగపూర్ వంటి దాదాపు 50కి పైగా దేశాలు ఇప్పటికే ఈ పాలిమర్ నోట్లను విజయవంతంగా వాడుతున్నాయి. భార‌త దేశంలో కూడా త్వరలోనే ఈ ప్లాస్టిక్ నోట్ల ట్రయల్స్ మొదలుకానున్నాయి,