పాము కాటుతో విద్యార్థి మృతి..
బిక్కనూర్, ఆంధ్రప్రభ : కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం భగీరత్ పల్లి గ్రామానికి చెందిన ఒక విద్యార్థి శనివారం ఉదయం పాము కాటుతో మృతి చెందారు గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన గొండ్ల నరసింహులు కుమారుడు నవీన్ తన ఇంట్లో నిద్రిస్తుండగా ఆయనకు పాము కాటు వేసింది వెంటనే కుటుంబ సభ్యులు గమనించి ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. మృతుడు నవీన్ గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నట్లు చెప్పారు. పాము కాటుతో నవీన్ మృతి చెందడం పట్ల గ్రామంలో విషాదఛాయలు చోటు చేసుకున్నాయి.
