నిత్య అన్నదానానికి రూ.1 లక్ష విరాళం..
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో నిర్వహిస్తున్న నిత్య అన్నదాన పథకానికి ఆగిరిపల్లి ప్రాంతానికి చెందిన వై. శివపార్వతి తన భర్త దివంగత పత్తిపాటి సాంబశివ ప్రసాద్ స్మారకార్థం రూ.1,00,116 విరాళంగా అందజేశారు. దేవస్థానం పాలకమండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) ను కలిసి భక్తిశ్రద్ధలతో విరాళం అందజేశారు. అనంతరం దేవస్థాన అధికారులు వారికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు కల్పించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) దాతకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, విరాళం రసీదును అందజేసి దేవస్థానం తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
