మ్యాజిక్ డ్రైన్ నిర్మాణ పనుల పరిశీలన..

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

ఆంధ్రప్రభ బ్యూరో ఉమ్మడి వరంగల్: శుక్రవారం, జనగామ మండలంలోని వడ్లకొండ గ్రామ పరిధిలో నిర్మిస్తోన్న మ్యాజిక్ డ్రైన్ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పరిశీలించారు. ఈ సందర్భంగా వంద మీటర్ల పొడవుతో 60 సెంటీమీటర్ల లోతు, ప్రతి 30 మీటర్లు పోయే కొలది 5 సెంటీమీటర్ల అదనపు లోతు తవ్వకాలతో మూడు లేయర్ లుగా నిర్మాణం చేస్తోన్న మ్యాజిక్ డ్రైన్ లో భాగంగా చివరి లేయర్ లో జీఎస్ఎం షీట్ ఏర్పాటును క్షుణ్ణంగా పర్యవేక్షించారు.
రోడ్లపై మురికి నీరు నిల్వ ఉండకుండా ప్రతి ప్రాంతంలో అవసరానికి అనుగుణంగా సోక్‌ పిట్లు ఏర్పాటు చేయాలని, నిర్మాణంలో నిర్దేశించిన ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని అధికారులను ఆదేశించారు. పిట్‌లలో వివిధ పరిమాణాల కంకర పొరలు, 150 GSM జియో-టెక్స్‌టైల్ ఫాబ్రిక్‌ను నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉపయోగించాలని, నీరు సులభంగా భూమిలోకి ఇంకిపోయేలా తగిన వాలుతో పనులు చేపట్టాలని సూచించారు. ఈ పరిశీలనలో డీఆర్డీఓ భాస్కర్, ఈజీఎస్ పీడీ సూరి, జనగామ ఎంపిడిఓ మహేష్ నాయక్, సర్పంచి రామ్ మోహన్ రెడ్డి, ఇతర సంబంధిత అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.