ములుగు జిల్లా, ఆంధ్రప్రభ : కుటుంబ కలహాలతో ఏఆర్ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్న సంఘటన ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రాలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాది కొత్తగూడెం జిల్లా బయ్యారంలో ఏఆర్ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న నర్సయ్య ఈరోజు ఉదయం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
మృతుని భార్య సునీత ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుంది. భార్యాభర్తల మధ్య నెలకొన్న గొడవల కారణంగానే నర్సయ్య ఆత్మహత్య చేసుకున్నాడని అతని బంధువులు ఆరోపిస్తున్నారు. భార్య సునీతపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.