భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే సమగ్ర భూ సర్వే: ఎమ్మెల్యే గండ్ర

రేగొండ, ఆంధ్రప్రభ : భూ సమస్యల శాశ్వత పరిష్కారానికే సమగ్ర భూమూల సర్వే నిర్వహిస్తున్నట్టు భూ సర్వేకు ప్రజలు సహకరించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.గురువారం గోరికొత్తపల్లి మండలం గాంధీ నగర్,కొత్తపల్లి గోరి,జగ్గయ్య పేట గ్రామాల్లో నిర్వహించిన భూ సమగ్ర సర్వే గ్రామ సభలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…. గ్రామాల్లో భూములు సాగు చేస్తున్న వారు ఒకరైతే, పట్టా పాస్ పుస్తకాలు మరొకరి పేరుపై ఉండటం వల్ల రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

ఇలాంటి భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలంటే సమగ్ర భూ సర్వే తప్పనిసరిగా నిర్వహించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.ప్రజాప్రతినిధులు,రే వెన్యూ అధికారులు గ్రామ ప్రజలను సమన్వయం చేసుకొని పారదర్శకంగా భూ సర్వే నిర్వహించాలని సూచించారు. వాస్తవంగా భూములను సాగు చేసుకుంటున్న అర్హులైన రైతులను గుర్తించి, నిబంధనల ప్రకారం వారికి పట్టాలు, పట్టాదారు పాస్ పుస్తకాలు అందించేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను సూచించారు.

అదేవిధంగా రెవెన్యూ భూములు, గ్రామకంఠం భూములు, ప్రభుత్వ భూములపై ఉన్న ఆక్రమణలను గుర్తించేందుకు భూ సర్వే ఎంతో దోహదపడుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను గుర్తించి తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావడం కూడా ఈ సర్వే ద్వారా సులభతరం అవుతుందని తెలిపారు.రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అత్యంత ముఖ్యమని, పాస్ పుస్తకాలు ఉంటే పంట రుణాలు, రైతు భరోసా మరియు ప్రభుత్వం అమలు చేస్తున్న ఇతర రైతు సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందడంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఎమ్మెల్యే గండ్ర పేర్కొన్నారు.

అర్హులైన రైతులకు భూ పట్టాలు, పాస్ పుస్తకాలు అందించే విషయంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.ఎన్నో ఏండ్లుగా గోరికొత్తపల్లి, నిజాంపల్లి, గాంధీ నగర్,గ్రామాల్లో పట్టాలు రాక రైతులు ఇబ్బంది పడుతున్నారనీ ఇప్పుడు నిర్వహించే భూ సర్వే ద్వారా పట్టాలు పొందవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్లు, ఆర్డీవో, హరికృష్ణ, తహసీల్దార్,హేమలత, ఆర్ఐ. రాజ్యలక్ష్మి, భూపాలపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గూటోజు కిష్టయ్య, కాంగ్రెస్ నాయకులు. నాయినేని సంపత్ రావు, నడిపెల్లి విజ్జన్ రావు,మోడెమ్ ఉమేష్ గౌడ్, సర్పంచులు. నిమ్మల శంకర్, నడిపెల్లి శాంతాదేవి – వెంకట్రావు, నాండ్రె సునీత- రవీందర్, బొజ్జo మమత- సురేష్,నాయకులు. సుదనబోయిన ఓం ప్రకాష్, తోకల సురేందర్ రెడ్డి, జోరు సుదర్శన్, పొనుగోటి వీరబ్రహ్మం, వావిలాల రమేష్, పత్తి తిరుపతి, బోయిని కుమారస్వామి, కానుగుల తిరుపతి, రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు, ఆయా గ్రామాల సర్పంచులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.