చిన్నారికి అండగా సీఎం సహాయనిధి..

  • రూ.3 లక్షల ఎల్‌ఓసీ అందజేత

భవానిపురం, ఆంధ్రప్రభ: విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి చొరవతో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన ఎల్ఓసీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) ను ఎన్డీయే కార్యాలయంలో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, టీడీపీ రాష్ట్ర నాయకులు గుర్రం కొండ,38 వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు సురభి బాలు అందజేశారు.

38 వ డివిజన్, కుమ్మరిపాలెంకు చెందిన మాజేటి స్నేహ (11) గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమెకు మరింత మెరుగైన వైద్యం అందించాలని శస్త్ర చికిత్స చేయాలని వైద్యులు తెలపడంతో వైద్యం సాయం కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ. 3 లక్షల విలువైన ఎల్ఓసీ ను బాధితురాలి తండ్రికి అందజేశారు. త్వరితగతిన స్పందించి ఎల్ఓసీని అందజేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరికి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.